మహర్షి.. ఫుల్ హ్యాపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్ 25వ సినిమా ‘మహర్షి’ విజయోత్సవాలు కొనసాగుతున్నాయి. ‘వీకెండ్ వ్యవసాయం’ కానె్సప్ట్‌తో మహేష్, పూజాహెగ్దె జోడీతో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన సినిమా మే 9న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత సి అశ్వీనీదత్ మాట్లాడుతూ ‘రైతు కుటుంబం నుంచి వచ్చిన మహేష్ 25వ సినిమాలో రైతు గొప్పతనాన్ని చాటిచెప్పే పాత్ర చేయడం హ్యాపీగా ఉంది’ అన్నారు. మరో నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడింది నిజమైనందుకు గర్వంగా ఉంది. మహేష్ 25వ సినిమా ఎపిక్ కావడం హ్యాపీ. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రాన్ని అందించేందుకు టీం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ప్రపంచానికి నాలుగు ముద్దల అన్నం పెడుతున్న రైతు గురించి తీసిన సినిమా ఇంత విజయం సాధించటం ఆనందంగా ఉంది’ అన్నారు. హీరో మహేష్ మాట్లాడుతూ ‘నా పాతిక సినిమాల జర్నీ ఎంతో ప్రత్యేకం. అందులో ఈ సినిమా మరింత ప్రత్యేకం. మదర్స్ డే రోజున సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అమ్మ దగ్గర కాఫీ తాగితే, దేవుడి గుళ్లో ప్రసాదం తిన్నంత ఫీలింగ్ ఉంటుంది నాకు. ఆవిడ ఆశీస్సులు నాకెంతో ముఖ్యం. ఈ విజయాన్ని అమ్మలందరికీ అంకితమిస్తున్నా’ అన్నారు.