దసరా టార్గెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున మరోసారి మన్మథుడి అవతారం ఎత్తుతుండటం తెలిసిందే. హీరో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో ‘మన్మథుడు 2’ చిత్రం రూపొందుతోంది. నాగార్జున సొంత బ్యానర్ సినిమా కనుక, షూట్ మొదలుపెట్టిన దగ్గర్నుంచే సినిమాపై ఆసక్తి కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో రకుల్‌తో జోడీ కడుతున్న నాగ్, ఆమధ్య కొన్ని ఇమేజ్‌లు బయటకు వదిలి తను మరోసారి కుర్రాడైనైపోయానని చెప్పకనే చెప్పాడు. ఇప్పటికే ‘పోర్చుగల్’లో కొద్దిరోజులు షూట్ జరిపిన చిత్రబృందం ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించి షెడ్యూల్ పూర్తి చేసినట్టు చెబుతోంది. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్‌లోని కీలక సన్నివేశాలు పోర్చుగల్ షెడ్యూల్‌లో షూట్ చేశామని అంటున్నారు. తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌కు షిప్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఈనెల 21నుండి తదుపరి షెడ్యూల్ మొదలవుతుందని, సమంత, కన్నడ బ్యూటీ అక్షరగౌడ ఈ షెడ్యూల్‌కూ హాజరవుతారన్న టాక్ వినిపిస్తోంది. చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తోన్న చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రొమాంటిక్ హీరోగా నాగార్జునను మరోసారి పరిచయం చేయనున్న సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.