రూట్ మార్చాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతకాలంగా సరైన హిట్స్‌లేక సతమతమవుతున్న రవితేజ -రోటీన్ డైరెక్టర్స్‌ని వదిలిపెట్టి కుర్రతరానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఓ మామూలు ప్రేమ కథను వైవిధ్యంగా తెరకెక్కించి ‘ఆర్‌ఎక్స్ 100’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతికి రవితేజ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. కుర్రకారు మనసుల్ని పట్టేసిన అజయ్‌తో ఓ ప్రయోగం చేసేందుకు రవితేజ సిద్ధమైనట్టు సమాచారం. నిజానికి ఆర్‌ఎక్స్ 100 ఇచ్చిన ఊపులో అక్కినేని చైతూతో తదుపరి ప్రాజెక్టును అజయ్ సెట్ చేశాడని ఆమధ్య వార్తలొచ్చాయి. టైటిల్ ‘మహాసముద్రం’ అని కూడా వినిపించింది. అయితే హీరో చైతూ మార్కెట్‌ను మించి కథకు బడ్జెట్ సిద్ధం చేయడంతో, ఆ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ లేకుండా పోయింది. దాంతో తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిన రవితేజను అజయ్ భూపతి లైన్‌లోకి తీసుకొచ్చాడని అంటున్నారు. మంచి మాస్ మసాలా కథతో రవితేజను రొటీన్‌కు భిన్నంగా స్క్రీన్‌పై చూపించేందుకు సంసిద్ధుడవుతున్నాడట. చాలాకాలంగా హిట్‌కు మొహం వాచ్చిన రవితేజ సైతం -అజయ్ టాలెంట్‌ను గుర్తించే అవకాశమిచ్చాడని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.