దాస్.. చెడుగుడు ఆడేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది లాంటి చిత్రాలలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు విశ్వక్‌సేన్. ప్రస్తుతం విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘్ఫలక్‌నుమా దాస్’. డి.సురేష్‌బాబు సమర్పణలో వన్మయి క్రియేషన్స్ బ్యానర్‌పై విశ్వక్‌సేన్ సినిమాస్, టెరనోవ పిక్చర్స్, మీడియా 9న క్రియేటివ్ వర్క్స్ అనుసంధానంతో పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రంలో సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి హీరోయిన్స్‌గా నటించగా, పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ పోలీసు అధికారిగా కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం నేడు రామానాయుడు స్టూడియో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేష్ ట్రైలర్‌ను విడుదల చేసి మాట్లాడుతూ- టీజర్ చూడగానే తెలిసిపోయింది.. అందరూ కొత్త కుర్రాళ్లు ఛాలెంజ్‌గా తీసుకుని కష్టపడి నటించారు. ఇక విశ్వక్‌సేన్ ప్రతి ఫ్రేమ్‌లో తన యాక్టింగ్ స్కిల్స్‌ని అద్భుతంగా చూపించారు. ట్రైలర్ బాగుంది. టీమ్ అందరూ అద్భుతంగా చేశారు. రీసెంట్ టైమ్‌లో ఇంతలా యూత్‌కి నచ్చే సినిమా రాలేదు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. హీరో, దర్శకుడు విశ్వక్‌సేన్ మాట్లాడుతూ- టీజర్‌కి టెరిఫిక్ రెస్పాన్స్ అందించారు. ట్రైలర్‌కు అంతకన్నా ఎక్కువ రెస్పాన్స్‌రావాలి అనుకున్నాను. రీసెంట్‌గా సురేష్ సర్ ఈ సినిమా చూసి మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వడమే కాదు, సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు. అలాగే వెంకటేష్‌గారికి గోల్డెన్ హ్యాండ్. అడగంగానే ఓకె అన్నారని తెలిపారు. నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ - సినిమా అద్భుతంగా వచ్చింది. నాచురల్‌గా రావాలని అడ్వాన్స్ టెక్నాలజీతో చేశారన్నారు.