వచ్చే నెలనుంచే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరో సూర్యతో తరువాతి ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు విశ్వాసం ఫేమ్ దర్శకుడు శివ. ఇటీవలే అధికారికంగా ప్రారంభమైన సినిమా నెలాఖర్లో సెట్స్‌పైకి వెళ్లాల్సివున్నా, సాధ్యం కాకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. దర్శకుడు శివ వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్న కారణంగా కొద్ది రోజులుగా సినిమా పనులకు దూరంగా ఉంటున్నాడు. సో, వచ్చే నెల మొదటివారం నుంచి సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకావొచ్చని చిత్రబృందం చెబుతోంది. ఇక ఈ సినిమా కూడా శివ గత సినిమాల శైలిలోనే పక్కా మాస్ అంశాలతో ఎమోషనల్‌గా తెరకెక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడట. ముఖ్యంగా సూర్య పాత్ర వైవిధ్యంగా ఉంటుందని అంటున్నారు. గోపీచంద్ హీరోగా వచ్చిన ‘శౌర్యం’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు శివ. తరువాత తమిళ స్టార్ అజిత్‌తో వరుస సినిమాలు తీసి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఇటీవలే అజిత్ హీరోగా విశ్వాసం సినిమాను తెరెకెక్కించాడు. తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. దాంతో శివతో సినిమా చేయడానికి సూర్య గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.