సందేశాత్మకంగా ఓ మనిషీ నీవెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిజ్వాన్ కల్షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా -ఓ మనిషి నీవెవరు. స్వర్ణ క్రియేషన్స్ పతాకంపై కృష్ణమూర్తి రాజ్‌కుమార్‌నాయుడు దర్శకత్వంలో స్వర్ణకుమారి దొండపాటి నిర్మిస్తున్నారు. ప్రభాకర్ సంగీతం సమకూర్చిన సినిమా ఆడియోను సీనియర్ నటుడు కృష్ణ ఆవిష్కరించారు. మొదటి వీడియో సాంగ్‌ను తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ విడుదల చేశారు. అనంతరం తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘మంచి కానె్సప్ట్‌ను ప్రజెంట్ చేస్తున్న సినిమా టీంకు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. అనూప్‌రూబెన్స్ మాట్లాడుతూ ఇలాంటి సినిమాలు చేయాలంటే గట్స్ కావాలి. చక్కని సందేశాత్మక చిత్రానికి పాటలు బాగా అమిరాయి అన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ తనకు కులమతాల భేదం లేదని, తనదృష్టిలో మనుషులంతా ఒక్కటేనన్నారు. అలాంటి షేడ్స్‌తోవున్న పాత్ర చెప్పగానే ఆలోచించకుండా చేస్తానన్నాను అన్నారు. వైవిధ్యమైన కష్టమైన పాత్రేనని, ఇలాంటి సినిమాలు చేయడానికి గట్స్ కావాలన్నారు. సినిమా యూనిట్‌లో మంచి కమిట్‌మెంట్ కనిపిస్తోందని, ఏసు పాత్రకు రిజ్వాన్ సరిగ్గా సూటయ్యాడన్నారు. సినిమా విజయం సాధించి మంచి పేరు తెస్తుందన్న నమ్మకం ఉందన్నారు. సీనియర్ నటి కవిత మాట్లాడుతూ అప్పట్లో తెరకెక్కిన కరుణామయుడు 16 భాషల్లో విడుదలై మంచి విజయం సాధించింది. అలాంటి నేపథ్యాన్ని తీసుకుని వేణుగోపాల్ సినిమా చేయడం హర్షించదగ్గ విషయం. ఇలాంటి సందేశాత్మక చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ గోపాలకృష్ణకు నేను వేరే కథ చెప్పానని, ఆయన ఈ కథ చెప్పి సినిమా తీయించారన్నారు. ఈ సినిమాతో కొత్తతారలు చాలామందే పరిచయం అవుతున్నారన్నారు. సినిమాని అన్నివర్గాల ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. రిజ్వాన్ కుల్షాన్ మాట్లాడుతూ నటుడిగా తనకు తొలి చిత్రమిని, ఏసు గొప్పతనాన్ని చెప్పే పాత్రలో నటించడం సంతోషాన్నిచ్చింది అన్నారు. కార్యక్రమంలో స్క్రీన్‌ప్లే రచయిత గోపాలకృష్ణ దొండపాటి, డీవోపీ సూర్యభగవాన్ మోటూరి తదితరులు మాట్లాడారు.