వస్తున్నాడు అల్లాద్దీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అగ్ర నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ నిర్మాణంలో గాయ్ రట్చయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమెరికన్ మ్యూజికల్ రొమాంటిక్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ -అల్లాద్దీన్. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను హీరో వెంకటేష్, వరుణ్ తేజ్ సంయుక్తంగా విడుదల చేశారు. ఇందులో జీనీ పాత్రను ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ చేశాడు. అల్లాద్దీన్‌గా మేనా మసూద్, ప్రిన్స్ జాస్మిన్‌గా నయోమి స్కాట్ కనిపిస్తారు. జీనీ పాత్రకు తెలుగులో సీనియర్ హీరో వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే, అల్లాద్దీన్ పాత్రకు వరుణ్‌తేజ్ డబ్బింగ్ చెప్పాడు. సినిమా మే 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ ‘జీనీ పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వడం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అంత పెద్ద సినిమాతో అసోసియేట్ అవ్వడం హ్యాపీగా ఉంది. మ్యాజిక్, ఫన్‌వున్న డిఫరెంట్ క్యారెక్టర్‌కి ఫస్ట్‌టైం వాయిస్ ఇస్తున్నా. జీనీ బాడీలాంగ్వేజ్ చాలా క్రేజీగా, ఫన్నీగా ఉంటుంది. సినిమా మొత్తం మ్యాజికల్ టైం, చాలా ఫాస్ట్‌గా ఉంటాడాయన. ఒక్కసారి పాత్రలోకి ఎంటరైన తరువాత ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పేశా. తెలుగువాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు కామెడీ ఇష్టమని మీకు తెలుసు. సినిమా చూస్తే తప్పకుండా క్రేజీ ఫీలవుతారు. నా పాత్రలోనే చిన్న థ్రిల్ ఉంది. ఇటీవలే వచ్చిన ఎఫ్-2లో వరుణ్‌కి ఓ మెంటార్‌లా ఉన్నా. ఇందులోనూ నేను తనకు సహాయపడతాను. ఈ గైడెన్స్‌లో తెలియకుండానే మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. మాడ్యులేషన్ కోసం కొంచెం హోంవర్క్ చేసిన మాట నిజమే. ఇకపై మా ఇద్దరి కాంబోలో ప్రాజెక్టులు వస్తే తప్పకుండా చేస్తాం’ అన్నారు. మెగాహీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘నాకు జీవితంలో నిజంగా జీనీలాంటి క్యారెక్టర్ వచ్చి కోరుకోమంటే ఈ ప్రపంచంలో అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. నేను చిన్నప్పటినుంచీ పిల్లలు స్టోరీలు చూడటానికే ఇష్టపడతాను. నేను, మా చెల్లి కలిసి ఇలాంటి సినిమాలు చూసేవాళ్లం గేమ్స్ ఆడేవాళ్లం. ఇప్పుడు ఇంతమంచి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పటికే సినిమా చూశాను. నా పాత్ర చాలా పవర్‌ఫుల్. నేను నటించిన చిత్రాలకు డబ్బింగ్ చెప్పడమన్నదే చాలెంజ్. అలాంటిది నేను చేయని పాత్రకు డబ్బింగ్ చెప్పడం మరింత కష్టమనిపించినా, ఎక్స్‌ప్రెషన్స్ పట్టుకుని చేయగలిగాను. జీనీ పాత్రకు వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారని తెలిసిన తరువాత, సెకెండ్ థాట్ లేకుండా డబ్బింగ్ చెప్పడానికి ఓకే అనేశాను’ అన్నారు.