పంచ్‌ల ప్రాక్టీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత్ర విషయంలో టాలీవుడ్ యువహీరోలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరమైతే ప్రత్యేక శిక్షణ తీసుకుని మరీ సెట్స్‌కు రావడం కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్ తన కెరీర్ ప్రారంభంలో ఈవిధంగా శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు అదే ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ సైతం ఫాలో అవుతున్నాడు. ఇటీవలే ‘అంతరిక్షం’ సినిమా కోసం జీరో గ్రావిటీలో జీవించడం గురించి శిక్షణ తీసుకున్నాడు. తాజాగా తన కొత్త చిత్రం కోసం బాక్సింగ్‌లో తర్ఫీదు పొందినట్టు తెలిసింది. ఇందుకోసం కాలిఫోర్నియాలో శిక్షణ తీసుకున్నట్టు సమాచారం. కిరణ్ కొర్రపాటితో ఆయన కొత్త చిత్రం చేస్తున్నాడు. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపిస్తాడు. ఆగస్టులో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. జిగర్తాండ తమిళ చిత్రం ఆధారంగా రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తోంది.