చాన్స్‌ల జోరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగమతి సక్సెస్ తర్వాత తెరమీదే కాదు బయట కనిపించడం కూడా అరుదైపోయిన అనుష్క కొత్త సినిమాల విషయంలో ఎంతకీ క్లారిటీ రావడం లేదు. కోన వెంకట్ నిర్మాణంలో ఓ డెబ్యు డైరెక్టర్ దర్శకత్వంలో రూపొందే మూవీతోటు సైలెన్స్ అనే ఇండో అమెరికన్ ఫిలిం మాత్రమే అనుష్క ఒప్పుకున్నట్టు ఇప్పటిదాకాఉన్న అప్ డేట్. తాజాగా మరో రెండు చారిత్రాత్మక ప్రాజెక్ట్స్‌లో అనుష్క భాగం కాబోతోందనే వార్త ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. దాని ప్రకారం సైరా నరసింహారెడ్డిలో ఒక థీమ్‌సాంగ్‌కోసం అనుష్క ఓకే చెప్పినట్టుగా తెలిసింది. అయితే టీమ్‌నుంచి దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. స్వీటీ గతంలో చిరుతో స్టాలిన్‌లో ఓ స్పెషల్ సాంగ్ కోసం కాలు కదిపింది. దాని తర్వాత ఈ కాంబో సాధ్యపడలేదు. సైరా తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌లో చాలా కీలకంగా అనిపించే ఓ క్యామియో కూడా స్వీటీ చేయబోతున్నట్టు మరో న్యూస్. బాహుబలి రెండు భాగాలూ విక్రమార్కుడు ఇలా అనుష్కతో రాజవౌళి కాంబినేషన్ మంచి బాండింగ్ సెట్ చేసింది. సో జక్కన్న అడిగితే అనుష్క కాదనే ప్రసక్తి ఉండక పోవచ్చు. ఇదీ అఫీషియల్‌గా తెలియాల్సి ఉంది.