నాగశౌర్యతో జోడీకట్టిన మెహ్రీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో నాగశౌర్యతో మెహ్రీన్ జోడీ కట్టింది. చలో, నర్తనశాల చిత్రాలను నిర్మించిన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై ఈ సినిమా ప్రారంభమైంది. రమణ తేజ దర్శకుడిగా పరిచయమవతున్నాడు. శంకర్‌ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్రరావు క్లాప్‌కొట్టి స్క్రిప్ట్‌ను దర్శకుడు రమణ తేజకు అందించారు. పరశురామ్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకురాలు నందినిరెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. మీడియాతో నాగశౌర్య మాట్లాడుతూ ‘ప్రొడక్షన్ నెం 3 ప్రారంభించామని చెప్పడానికి హ్యాపీగా ఉంది. నన్ను ఆశీర్వదించిన కె రాఘవేంద్రరావు, పరశురామ్, నందినిరెడ్డిలకు కృతజ్ఞతలు. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతున్నాం. 70శాతం షూటింగ్ వైజాగ్‌లో చేయాలన్నది ప్లాన్. దర్శకుడు రమణ తేజ నా స్నేహితుడు. ఇద్దరం యుఎస్‌లోని బూస్టన్ ఫల్మ్ స్కూల్లో కలిశాం. మంచి కథ, డెఫినెట్‌గా బాగా తీస్తాడని ఆశిస్తున్నా. మెహ్రీన్‌తో కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. మా ప్రొడక్షన్‌లో వచ్చిన తొలి సినిమాకంటే పెద్ద హిట్ కొడుతుందన్న నమ్మకంతో ఉన్నా’ అన్నారు. హీరోయిన్ మెహ్రీన్ మాట్లాడుతూ ‘అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మా టీంకి ఆల్ ది బెస్ట్’ అన్నారు. దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ ‘నన్ను నమ్మి మంచి కథకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతలు, కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు. కెమెరామెన్ మనోజ్ మంచి మిత్రుడు. ఇద్దరి అదే ఫిల్మ్ స్కూల్లో చదువుకున్నాం. అందరికీ నచ్చే సినిమానే తీస్తానని ప్రామిస్ చేస్తున్నా’ అన్నాడు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ ‘కథ చాలా వైబ్రెంట్‌గా ఉందని, ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేశా’ అన్నారు.