అక్టోబర్ 9న హీరో విశాల్ పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో విశాల్ తమిళంలో స్టార్ హీరోగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అతను నటించిన అయోగ్య రిలీజైంది. మరోవైపు నడిగర సంఘం భవంతి నిర్మాణం పూర్తి చేసి తన శపథాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులేస్తున్నాడు. ముందే ప్రకటించినట్టు జీవిత భాగస్వామిని వెతుక్కుని పెళ్లాడేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు కుర్రాడిగా హైదరాబాద్ అమ్మాయిని పెళ్లాడేందుకే విశాల్ ఆసక్తిని కనబర్చడం ఆసక్తికరం. రాజధానికి చెందిన అనీషారెడ్డితో విశాల్ నిశ్చితార్థం మార్చిలో జరిగింది. ఈ నిశ్చితార్థానికి సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు స్టార్లు హాజరయ్యారు. అయితే విశాల్ పెళ్లి తేదీని మాత్రం ప్రకటించలేదు. తాజాగా విశాల్- అనీషా పెళ్లి డేట్ ఫిక్స్‌అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 9న పెళ్లి ముహూర్తం నిశ్చయించారని సమాచారం. ముహూర్తం ఫిక్సయినా వెన్యూ ఎక్కడ? అన్నదానికి ఇంకా క్లారిటీ రాలేదు. హైదరాబాద్‌లోనా లేక చెన్నయ్‌లోనా? అన్నదానిపై ఇరువైపుల నుంచి పెద్దలు ఒక క్లారిటీకి వచ్చారా లేదా? అన్నది తెలియాల్సి ఉంది. విశాల్ హీరోగా.. నిర్మాతగా పూర్తి బిజీ. మరోవైపు రాజకీయాల్లోనూ అంతే స్పీడ్‌గా ఉన్నాడు. నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా... నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ తిరుగు లేని హవా సాగిస్తున్న సంగతి తెలిసిందే.