ట్రాప్ సెన్సార్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మాజీ, మహేంద్ర, షాలు కాత్యాయని శర్మ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ట్రాప్. కవితా లయ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆళ్ల స్వర్ణలత నిర్మించిన మూవీ త్వరలో రిలీజ్ అవుతుండగా ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఏ సర్ట్ఫికెట్‌ని పొందింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఆళ్ల స్వర్ణలత మాట్లాడుతూ.. ట్రాప్ చిత్రం కథ చాలా వెరైటీగా ఉంటుంది. దర్శకుడు ఫణీంద్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా సినిమాని తెరకెక్కించాడు. త్వరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు. దర్శకుడు ఫణీంద్ర మాట్లాడుతూ.. ట్రాప్ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాకి ప్రాణం పోసిన హర్ష ప్రవీణ్‌కి కృతజ్ఞతలు. త్వరలోనే ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది అన్నారు.