సెన్సార్‌లో ‘సువర్ణ సుందరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్ణ, సాక్షిచౌదరి, జయప్రద ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సువర్ణసుందరి’. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న క్యాప్షన్‌తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఓ సాంకేతిక అద్భుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సూర్య మాట్లాడుతూ.. సువర్ణసుందరి విఎఫ్‌ఎక్స్‌కోసం ఏడాదిపాటు వర్క్ జరిగింది. ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈనెలలోనే గ్రాండ్‌గా ఆడియోను విడుదల చేయనున్నాము. పబ్లిసిటీపరంగా కూడా విభిన్నమైన ప్లానింగ్‌తో ప్రమోట్ చేస్తున్నాము. మే 31న సినిమాను విడుదల చేయనున్నామన్నారు. నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ.. సువర్ణసుందరి చిత్రం సెన్సార్‌కు సిద్ధమయింది. తెలుగు ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈనెలలోనే ఆడియోను విడుదల చేయనున్నాము. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.