కీర్తికి మరొకటి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో, అలాగే హిందీలో ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా వుంది. అందులో భాగంగా ప్రస్తుతం తెలుగులో నరేంద్ర దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తుండగా నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తోంది. వీటితోపాటు హిందీలో అజయ్ దేవగన్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా సర్కార్ తరువాత కోలీవుడ్‌లో చాలా రోజుల తరువాత మరో సినిమాకు ఓకె చెప్పిందట కీర్తి. ఓ నూతన దర్శకుడు డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు నిర్మించనున్నాడు. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళనున్నదట.