అసలు పేరు ఆలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో కియారా అద్వాని ఒకరు. నటన.. గ్లామర్.. యూత్‌లో క్రేజ్.. పుష్కలం. రీసెంట్‌గా ఈ హాట్ బ్యూటీ ‘్ఫట్ అప్ విత్ ది స్టార్స్ సీజన్ 2’ కార్యక్రమంలో పాల్గొంది. ఆ టైంలో పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకుంది. తనకు భారీగా గుర్తింపు తీసకొచ్చిన లస్ట్ సిరీస్ గురించి మాట్లాడుతూ -ఆ సిరీస్ నిర్మాత కరణ్ జోహార్ తనను ఆడిషన్ చేయకుండానే ఎంపిక చేశాడని చెప్పింది. కరణ్ నటులను సులభంగా గుర్తిస్తాడని చెబుతూనే, సంచలనం సృష్టించిన వైబ్రేటర్ సీన్‌ను ప్రస్తావించింది. ఆ సీన్‌కు ముందు కరణ్ ‘దాన్నో జోక్‌లాగ చేయవద్దు. ఎలా వుందో అలా చెయ్. ఫన్నీ సీనే కానీ ఫన్నీగా చేయవద్దు’ అంటూ సూచించాడట. ఇక తన పేరు గురించి ఎవరికీ తెలియని ఒక విషయాన్ని వెల్లడించింది. అసలు తన పేరు కియారా కాదట. ఆలియా ఆద్వాని అట. అయితే సల్మాన్ ఖాన్ తన పేరును మార్చుకోమని సూచించాడట. ఆల్రెడీ అలియాభట్ పేరుతో ఒక నటి ఉంది. ఇండస్ట్రీలో ఒకే పేరుతో ఇద్దరు హీరోయిన్లు ఉండటం కుదరదని సూచించాడట. అయితే కియారా పేరును తనే ఎంపిక చేసుకున్నట్టు తెలిపింది. కియారా ప్రస్తుతం కబీర్‌సింగ్, గుడ్‌న్యూస్, షేర్షా, లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో నటిస్తోంది.