రీమేక్‌లో సల్మాన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజైంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో కథానాయిక. అల్లరి నరేష్ మరో కీలక పాత్రను పోషించారు. ఓవర్సీస్‌లో ఏకంగా 2500పైగా ప్రీమియర్లు ప్లాన్ చేశారంటే మహర్షి దూకుడు గురించి అర్థం చేసుకోవచ్చు. మహేష్ నటించిన ఈ సినిమా రిజల్ట్ కోసం అటు బాలీవుడ్ స్టార్లు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తుండటం ఆసక్తికరం. గత కొంతకాలంగా ప్రపంచమంతా తెలుగు సినిమావైపు ఆసక్తిగా చూస్తోంది. ఇక్కడ సినిమాల్ని రీమేక్ చేసేందుకు ఇరుగు పొరుగు పరిశ్రమలు ఎగ్జయిట్‌మెంట్ కనబరుస్తున్నాయి. అందుకే మహర్షి రిపోర్టుకోసం మరీ ఇంతగా ఎగ్జయిట్ అవుతున్నారని అర్థమవుతోంది. ప్రభుదేవాతో కలిసి కండల హీరో సల్మాన్‌ఖాన్ ముంబైలో మహర్షి సినిమాని వీక్షిస్తారని తెలుస్తోంది. భాయ్ ప్రత్యేకించి ఈ సినిమాపై ఆసక్తిని కనబరచడానికి ఓ కారణం వుంది. ఒకవేళ సినిమా కథాంశం నచ్చితే రీమేక్ రైట్స్ కొనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంలో దిల్‌రాజు కాంపౌండ్‌లో ఎగ్జయిట్‌మెంట్ కనిపిస్తోందని సమాచారం. మహేష్‌తో సల్మాన్ అనుబంధం ఇప్పటిది కాదు. సంచలనాల పోకిరి చిత్రాన్ని ప్రభుదేవా దర్శకత్వం హిందీలో వాంటెడ్(2009) పేరుతో రీమేక్ చేస్తే అక్కడ కూడా సంచలన విజయం సాధించింది. బాలీవుడ్‌లో తొలి 100 కోట్ల క్లబ్ చిత్రంగా వాంటెడ్ రికార్డులకెక్కింది. అప్పటినుంచి మహేష్ నటించే సినిమాలను ప్రత్యేకించి సల్మాన్ వీక్షిస్తుంటారు. రీమేక్ ఆలోచనతోనే సల్మాన్ మహర్షి షో వీక్షిస్తున్నారని తెలుస్తోంది.