జయం రవితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్నమైన కథలు చేస్తూ ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుకుంటున్నాడు జయం రవి. కోమలి ప్రాజెక్టుతో బిజీగావున్న రవి, అప్పుడే 25వ ప్రాజెక్టును సైతం లైన్లో పెట్టాశాడు. ఆండ్రియా నటించిన ‘ఎండ్రెండ్రుం పున్నగై’ చిత్రంతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అహ్మద్ -కొత్త ప్రాజెక్టును తెరకెక్కిస్తాడని తెలుస్తోంది. సుజాతా విజయకుమార్ నిర్మించనున్న ఈ చిత్రంలో జయంరవితో ఇద్దరు హీరోయిన్లు జోడీ కడతారని తెలుస్తోంది. ఒక హీరోయిన్‌గా తాప్సిని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఇటీవలే ముంబయిలో ఆమెకు దర్శకుడు కథ వినిపించాడని, వెంటనే ఆమె ఓకే చెప్పిందట. హిందీలో చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, కథ నచ్చి తాప్సి ఓకే చెప్పడం హ్యాపీగా ఉందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. రెండో హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ఇదిలావుంటే, ప్రస్తుతం చేస్తున్న కోమలి చిత్రంలో తొమ్మిది గెటప్పులతో సంచలనం సృష్టించనున్నాడు -జయం రవి.