ఎక్కడైనా.. విలన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లెజెండ్’తో విలన్ అవతారం ఎత్తిన జగపతిబాబు, దక్షిణాది రాష్ట్రాలకు క్రేజీ విలనయ్యాడు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లోనూ ప్రతి నాయకుడిగా బిజీ అయ్యాడు. గురువారం విడుదలైన మహేష్‌బాబు సిల్వర్ జూబ్లీ సూపర్ ప్రాజెక్టు ‘మహర్షి’లోనూ విలన్‌గా జగపతిబాబు సత్తా చూపించాడని అంటున్నారు. తెలుగు చిత్రాలతోపాటు తెలుగేతర భాషా చిత్రాలు, ముఖ్యంగా కన్నడ చిత్రాలూ చేయాలని అనుకుంటున్న జగపతికి -అక్కడి ఇండస్ట్రీ నుంచి బాగానే ఆదరణ దొరుకుతుంది. డిమాండ్- సప్లై రూల్ ప్రకారం విలన్ పాత్రలకు వస్తోన్న ఆదరణతో భారీగా పారితోషికం పెంచేసినా -ఆయనకు దక్కాల్సిన పాత్రలు దక్కుతూనే ఉన్నాయి. పారితోషికం ఎంత పెంచినా పట్టించుకోకుండా జగపతిని విలన్‌గా చూపించేందుకు దర్శక నిర్మాతలూ వెనుకాడటం లేదు. ఇదిలావుంటే -తాజాగా కన్నడలోని ఓ భారీ ప్రాజెక్టులో జగపతిబాబుకు చోటు దక్కినట్టు తెలుస్తోంది. దర్శన్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాబర్ట్’ చిత్రంలో జగపతిబాబు ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నాడని టాక్. ఈ మధ్యనే ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. తెలుగు చిత్రాలతోపాటు, దక్షిణాది భాషా చిత్రాల్లో తన మార్కెట్ విస్తృతం చేసుకోడానికి జగపతిబాబు ఫోకస్ పెట్టాడని ఇండస్ట్రీ టాక్.