ఆసక్తికరంగా సీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా పేరు సీత. నేను గీసిందే గీత. ప్రాస బాగుంది కదా -అంటోంది కాజల్ అగర్వాల్. టైటిల్ పాత్రతో కాజల్ చేస్తున్న తాజా చిత్రం -సీత. తేజ దర్శకుడు. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడు. మన్నారా చోప్రా మరో కథానాయిక పాత్ర పోషిస్తోంది. ఫైటింగ్, యాక్సిడెంట్ సన్నివేశాలతో శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. కాజల్ డైలాగ్‌కు తనికెళ్ల భరణి కౌంటరేస్తూ ‘ఇది కంచుకే కుంచులా ఉందిరా బాబూ’ అనడం కాజల్ పాత్ర తీరుతెన్నులను స్పష్టం చేస్తోంది. అమాయక యువకుడు రామ్‌గా బెల్లంకొండ, అతన్ని జాగ్రత్తగా చూసుకునే చురుకైన సీతగా కాజల్, ప్రతినాయకుడి పాత్రలో సోనూసూద్ కనిపించనున్నారు. ‘రావణుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పుకాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు’ అంటూ ట్రైలర్ చివర్లో హీరో చెప్పిన డైలాగ్ హైలెట్‌గా ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న చిత్రం మే 24న విడుదల కానుంది.