ఉత్కంఠగా సెవెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెహెమాన్, హవీష్, నందిత శే్వత, అనీషా ఆంబ్రోస్, రెజీనా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం -7. నిజార్ షఫీ తెరకెక్కించిన క్రైం థ్రిల్లర్ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ‘ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువతను మోసం చేసి పారిపోయిన కార్తీక్ కోసం పోలీసులు వెతుకుతున్నారు’ అన్న డైలాగ్‌మీద ట్రైలర్ ప్రారంభం కావడంతో ఉత్కంఠ రేకెత్తించింది. ట్రైలర్‌లో కట్ చేసిన డైలాగ్‌తో హీరో కార్తీక్ ఒక్కడా? ఇద్దరా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అసలు అమ్మాయిల్ని మోసం చేసి మిస్సైందెవరు? సెవెన్ దేనికి సంకేతం? బాధిత అమ్మాయిల సంఖ్యా.? టైటిల్ వెనుక కథేంటి? అన్నవి ఆసక్తి కలిగించే విషయాలు. ఇవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 5న సినిమాను ఆడియన్స్ ముందుకు తేనున్నట్టు చిత్రబృందం చెబుతోంది.