జెర్సీ.. జెన్యూన్ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ -నిజాయితీతో చెప్పిన కథగా నాని కితాబునిచ్చాడు. విడుదలైన జెర్సీ మంచి టాక్ తెచ్చుకోవడంతో దిల్ రాజు అప్రీసియేట్ మీట్ ఏర్పాటు చేశారు. మీట్‌లో హీరో నాని మాట్లాడుతూ కథ విన్నపుడే అద్భుతం అనిపించింది. గౌతమ్ కథలో ఎంత నిజాయితీ ఉందో ఆయనతో అంతే హానెస్టీ ఉంటుంది. మనసులోంచి వచ్చి జెన్యూన్ కథ అయినపుడు తప్పకుండా మ్యాజిక్ క్రియేటవుతుందని నేను నమ్ముతాను. గౌతమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ అలాగే ఉన్నారు. పెద్ద దర్శకుడు అవుతాడని నమ్మాను. నాలో అర్జున్‌ని చూపించినపుడు గౌతమ్‌కి, మమ్మల్ని నమ్మి ముందుకొచ్చిన నిర్మాతలు చినబాబు, వంశీ, పీడీవీ ప్రసాద్‌కు కృతజ్ఞతలు. సినిమా నుంచి సెపరేట్‌గా కెమెరా ఎక్కడా కనిపించదు. అదీ సాను పనితనం. ఇక అర్జున్ మీద చిరాకు పడినప్పుడల్లా ‘నేను బ్యాడ్ అనుకుంటారేమో’ అంటూ శ్రద్ధ కంగారు పడేది. చాలా ఎడ్జ్‌మీదున్న క్యారెక్టర్ చేసింది. ఇలా టెక్నీషియన్స్, నాన్ టెక్నీషియన్స్ అంటూ ఎవ్వర్నీ ఎక్కువ తక్కువ చేయలేం. మామూలుగా ఐదేళ్ల తరువాత ప్రతి సినిమా పాతబడినట్టు అనిపిస్తుంది.క కానీ, ఇక్కడున్నవాళ్లంతా పాతబడొచ్చుగానీ జెర్సీ పాతబడదు. కాన్ఫిడెంట్‌గా చెబుతున్నా’ అన్నాడు. కార్యక్రమం నిర్వహించిన దిల్‌రాజు మాట్లాడుతూ ఓ మంచి సినిమాను చూసినపుడు మొత్తం చిత్రబృందాన్ని అప్రీషియేట్ చేయాలనిపిస్తుంది. అందులో భాగమే ఇది. జీవితంలో సకెస్‌లు, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. కానీ ఇలాంటి కార్యక్రమాలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి. అంతా అద్భుతంగా చేశారు. జెర్సీని ఓ రేంజికి తీసుకెళ్లారు. ఇంతకంటే ఏంకావాలి’ అంటూ చిత్రబృందాన్ని కొనియాడారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో నాని కాన్ఫిడెంట్ చూసిన దగ్గర్నుంచే నాలో టెన్షన్ మొదలైంది. మా నమ్మకాన్ని నిజం చేసేందుకు ఆడియన్స్‌కి కృతజ్ఞతలు. పరిశ్రమ పెద్దలు, ప్రముఖులు.. గొప్పవాళ్లంతా ఇలా అప్రీషియేట్ చేస్తుంటే -మరో సినిమాకు ఎంకరేజ్‌మెంట్ ఇచ్చినట్టు అనిపిస్తోంది అన్నాడు. హీరోయిన్ శ్రద్ధ మాట్లాడుతూ ఇక్కడ ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే తీరు హ్యాపీగా ఉందని, ఈ అనుభూతి ఎప్పటికీ మరువలేనిదని పేర్కొంది.