నాన్నే... విలన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు తాజా చిత్రంగా ‘మహర్షి’ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తరువాత చేయాల్సిన అనిల్ రావిపూడి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు మహేష్. ఆ ప్రాజెక్టు సన్నాహాలు చకచకా సాగుతున్నాయి. ప్రతినాయకుడి పాత్రను అనిల్ పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట. సో, శ్రీమంతుడిలో నాన్నగా మెప్పించిన జగపతిబాబునే, ఈ ప్రాజెక్టులో విలన్‌గా చూపించేందుకు సిద్ధపడుతున్నాడట. జగపతిబాబు సైతం ‘యస్’ చెప్పేసి, మహేష్‌తో తలపడేందుకు రెడీ
అయినట్టు సమాచారం.
మళ్లీ కమెడియన్‌గా..
నిర్మాతగా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన నటుడు బండ్ల గణేష్ మళ్లీ కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడట? తాజాగా ఆయన కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నది సూపర్ స్టార్ మహేష్‌బాబు సినిమా కావడం విశేషం. వివరాల్లోకి వెళ్తే కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, తరువాత నిర్మాతగామారి తొలి ప్రయత్నంగా రవితేజతో ఆంజనేయులు తీసాడు. అలాగే పవన్‌కళ్యాణ్‌తో గబ్బర్‌సింగ్ తీసి సంచలన విజయాన్ని అందుకున్నాడు. తరువాత రెండు మూడు సినిమాలు చేసిన బండ్ల గణేష్‌కి వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దాంతో సినిమాల నిర్మాణానికి బ్రేక్ ఇచ్చేసిన బండ్ల ఏడాదిగా సైలెంట్‌గా ఉన్నాడు. బండ్లగణేష్ మళ్లీ మరో సినిమా నిర్మిస్తాడని అనుకునేలోగా ఆయన నిర్మాతగా కాదు కమెడియన్‌గా ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఎఫ్2తో సంచలన విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంగా మహేష్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కమెడియన్ పాత్రకోసం బండ్ల గణేష్‌ని సంప్రదించాడట అనిల్ రావిపూడి. తన పాత్ర బాగా నచ్చడంతో కమెడియన్‌గా నటించేందుకు ఓకే చెప్పాడని టాక్. కామెడీ సన్నివేశాలను అద్భుతంగా మలిచే అనిల్ రావిపూడి.. బండ్ల గణేష్‌కోసం సూపర్ సీన్స్ రాశాడట. ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తే మళ్లీ కమెడియన్‌గా క్రేజ్ తెచ్చుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నాడు బండ్ల. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన వినోదం సినిమాతో కమెడియన్‌గా పరిచయమైన బండ్ల గణేష్, తరువాత వరుస సినిమాలతో బిజీఅయ్యాడు. ఓ దశలో పాపులర్ కమెడియన్‌గా మారాడు. తరువాత నిర్మాతగా మారి నాలుగైదు సినిమాలు తీసాడు.