వాల్మీకి వైరల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్‌తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి. సినిమా నుంచి తాజాగా విడుదలైన వరుణ్‌తేజ్ మేకోవర్ స్టిల్ ఆకట్టుకుంటోంది. వాల్మీకి చిత్రానికి సంబంధించి వరుణ్‌తేజ్‌పై కొన్ని సన్నివేశాలను ఇప్పటికే హరీశ్‌శంకర్ చిత్రీకరించాడు. కాగా ఆ సన్నివేశాల్లోని తన గెటప్‌కు సంబంధించిన స్టిల్‌ను వరుణ్‌తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పొడుగాటి వంకీల జుత్తు, చెవిపోగుతో వైవిధ్యమైన స్టిల్ మెగా అభిమానులను అలరిస్తోంది. సినిమాలో తమిళ యంగ్ హీరో అథర్వ మురళి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.