శ్రద్ధగా.. ట్రిపుల్ ఆర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటుతిరిగి ఇటుతిరిగి ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులోకి వచ్చిన శ్రద్ధాకఫూర్ కోసం -ఏకంగా కథలోనే మార్పులు చేయబోతున్నాడట జక్కన్న. బాహుబలి తరువాత ఎస్‌ఎస్ రాజవౌళి అంతే శ్రద్ధగా తెరకెక్కిస్తున్న చిత్రం -ఆర్‌ఆర్‌ఆర్. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న చిత్రంలో ఆలియాభట్, శ్రద్ధకఫూర్‌లు హీరోలతో జోడీ కట్టనున్నారు. శ్రద్ధను తీసుకుంటున్న విషయాన్ని యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. స్క్రిప్ట్‌లో మార్పులకు జక్కన్న సిద్ధపడ్డాడంటే శ్రద్ధ దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనని అంటున్నారు. శ్రద్ధను తీసుకోవడం కురదని పక్షంలో మళ్లీ ఇబ్బందులు తలెత్తకుండా పరిణీతి చోప్రానూ దృష్టిలో పెట్టుకునే మార్పులు చేస్తున్నట్టు సమాచారం. స్వాతంత్య్రానికి ముందునాటి సంఘటనలు చూపించే కథలో తారక్‌కు జోడీగా బ్రిటిష్ నటినే తీసుకోవాలనుకున్నా -ఎదురైన సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ముందు ఎంపిక చేసుకున్న బ్రిటీష్ నటి డైసీని పక్కకు తప్పించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో చరణ్ అల్లూరి పాత్ర, తారక్ కొమరం భీమ్ పాత్రల్లో కనిపిస్తారు. అజయ్‌దేవగణ్ కీలక పాత్రలో కనిపించే ఈ చిత్రాన్ని 2020 జూలై 30న ఆడియన్స్ ముందుకు తేనున్నారు.