భరత్‌గా సల్మాన్ ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సల్మాన్ అంటేనే బాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఓ పూనకం. తిరుగులేని హీరోగా కెరీర్‌ను సాగిస్తున్న సల్మాన్ నుంచి వస్తున్న తాజా చిత్రం -భరత్. వైవిధ్యమైన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్. కొద్దిరోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రానికి సంబంధించి తాజాగా సల్మాన్ ఫస్ట్‌లుక్ పోస్టర్ స్టిల్‌ను బయటకు వదిలారు. క్యారెక్టర్ మేకోవర్‌తో బయటకు వచ్చిన స్టిల్ ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెరిసిన గెడ్డం.. మెలితిప్పిన మీసం.. అక్కడక్కడా పండిన జుత్తు. నలుపు కళ్లద్దాలు. పోస్టర్‌పై సల్మాన్ ఇచ్చిన లుక్ ఆసక్తికరంగా ఉంది. సల్మాన్ సరసన నటిస్తున్న కత్రినా కైఫ్ ఫస్ట్‌లుక్‌ను ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసింది. ఈ లుక్స్‌ను పోల్చి చూస్తే -మెస్మరైజ్ చేసే ఇతివృత్తంతోనే భరత్ రూపుదిద్దుకుంటుందన్న విషయం అర్థమవుతుంది. చిత్రంలో టబు, దిశాపటాని, జాకీష్రాఫ్‌లు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2017లో ‘టైగర్ జిందా హై’తో బ్లాక్‌బస్టర్ హిట్టిచ్చిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలోనే ‘భరత్’ వస్తుండటంతో, సల్మాన్ మరో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటాడన్న అంచనాలు వినిపిస్తున్నాయి.