నాగ్.. మూడో బిగ్ బాస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్‌తో తెలుగులో బిగ్‌బాస్ షోకి మంచి క్రేజ్ ఏర్పడింది. రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించి క్రేజ్ సాధించినా, కొన్ని వివాదాల కారణంగా పక్కకు తప్పుకున్నాడు. తాజాగా మూడో సీజన్‌కోసం సమాలోచనలు జరిపిన టీమ్ -ఫైనల్‌గా కింగ్ నాగార్జునను ఎంపిక చేశారని టాక్. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో బిజీగావున్న జూనియర్ ఎన్టీఆర్ కోసం గట్టిగానే ట్రై చేసింది కానీ తను ససేమిరా అన్నాడట. కొంతకాలం వెంకటేష్ పేరూ వినిపించటం తెలిసిందే. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ని నాగ్ నడిపించిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా దగ్గర చేసింది. అందుకే ఫైనల్‌గా నాగ్‌ని సంప్రదించగా మా ఛానల్‌లో గతంలో కొనసాగిన ప్రగాఢమైన అనుబంధం దృష్ట్యా ‘ఓకే’ చెప్పాడని అంటున్నారు. త్వరలోనే ఈ సమాచారం అధికారికంగా వెలువడొచ్చు. జూన్ నుంచి మూడో సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.