జెస్సీ.. సక్సెస్ ఊహించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెస్సీ సాధించిన విజయంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. అతుల్ కులకర్ణి, కబీర్‌సింగ్, అర్చనా శాస్ర్తీ, ఆషిమా నర్వాల్ ప్రధాన తారాగణంగా రూపొందిన హారర్ థ్రిల్లర్ జెస్సీ. ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై వి అశ్వినికుమార్ దర్శకత్వంలో శే్వతాసింగ్ నిర్మించిన చిత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో పివిఆర్ సినిమాస్ ఉదయ్ మాట్లాడుతూ హారర్ చిత్రానికి ఇంత భారీగా కలెక్షన్స్ వస్తాయని అనుకోలేదని, వన్ షోతో మొదలై మల్టీప్లెక్స్‌లో సెవెన్ షోస్ నడుస్తున్నాయన్నారు. నిర్మాత శే్వతాసింగ్ మాట్లాడుతూ చిన్న అయోమయంతో సినిమాను విడుదల చేశామని, ఆడియెన్స్ టాక్ విన్న తర్వాత పడిన కష్టమంతా మర్చిపోయామన్నారు. మాపై నమ్మకంతో పివిఆర్ సినిమాస్ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకొచ్చారని, ఇప్పుడు సినిమా అద్భుతం సృష్టిస్తోందన్నారు. జెస్సీని మరింత ఆదరించాలని ఆడియన్స్‌ని కోరారు. దర్శకుడు అశ్వినికుమార్ మాట్లాడుతూ సినిమా విడుదలకు ముందు చాలా సమస్యలే ఎదుర్కొన్నాం. చిన్నగా విడుదలైన సినిమా మంచి రెస్పాన్స్ సాధించింది. మంచి కానె్సప్టును ఆడియన్స్ ఆదరిస్తారన్న విషయం ఈ సినిమాతో మరోసారి రుజువైంది అన్నారు. ఆషిమా నర్వాల్ మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణతోపాటు మీడియా ప్రోత్సాహం లభించటం చిత్రబృందం అదృష్టమన్నారు. మంచి సినిమాలో తనను భాగం చేసినందుకు దర్శకుడు అశ్వికుమార్, నిర్మాత శే్వతాకు కృతజ్ఞతలు తెలిపారు.