ఐరా వచ్చేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఐరా ఈ నెల 29న విడుదల కానుంది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్, కెజెఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. సర్జున్ దర్శకత్వం వహించారు. కెజెఆర్ స్టూడియోస్ అధినేతలు మాట్లాడుతూ- ఐరా సినిమా పోస్టర్లు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి. డిగ్లామరస్ భవానీగా నయనతార లుక్స్‌కి ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తోంది. భవాని, యమున అనే రెండు పాత్రల రూపురేఖల మధ్య వున్న వేరియేషన్ కథలోనూ కన్పిస్తుంది. హారర్, థ్రిల్లర్లు ఇష్టపడేవారికి మాత్రమే కాదు భావోద్వేగాలను ఇష్టపడేవారందరికీ ఈ సినిమా నచ్చుతుంది అన్నారు. దర్శకుడు సర్జున్ మాట్లాడుతూ- ఇంద్రుడి వాహనం పేరు ఐరావతం. అందులోనుంచే మేం ఐరా అనే పదాన్ని ఎంపిక చేసుకున్నాం. ఐరా అనగానే అందరూ నయనతార పాత్ర పేరని అనుకుంటారు. ఆమె పేరు ఇందులో ఐరా కాదు. కాకపోతే పాత్ర బలాన్ని సూచించడానికి ఐరా అని పేరు పెట్టాం. ఇది సూపర్ నేచురల్ త్రిల్లర్ అయినప్పటికీ, రెగ్యులర్ హారర్ జోనర్‌లో కనిపించే వినోదాన్ని మించి ఇంకా ఏదో చేయాలని ప్రయత్నించాం. సాంకేతికంగా ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. తొలి సగం ఎంత ఉత్కంఠగా సాగుతుందో, రెండో సగం అంతకుమించి ఉంటుంది. పెర్‌ఫెక్ట్ స్క్రీన్‌ప్లేకి నిదర్శనం ఈ సినిమా అన్నారు.