ఆది కొత్త సినిమా ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది సాయికుమార్, వేదిక జంటగా తెలుగు, తమిళ బైలింగ్వుల్ చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది. కార్తీక్ విఘ్నేశ్ దర్శకుడు. హీరోయిన్ వేదిక నటిస్తున్న నాలుగో తెలుగు చిత్రమిది. మార్చి 25నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చిత్తూరు జిల్లాలోని తలకోనలో ప్రారంభంకానుంది. రోబో 2.0 చిత్రాలకు అసోసియేటె కెమెరామెన్‌గా పనిచేసిన గౌతమ్‌జార్జ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అందిస్తన్నారు. సి.సత్య సంగీతాన్ని అందించగా, అర్జున్ సురవరం చిత్రాన్ని నిర్మించిన అరా సినిమాస్ ప్రై. లి బ్యానర్‌పై నిర్మితమవుతున్న రెండో చిత్రమిది. సినిమాలోని మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు.