మే 10న అయోగ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ఎన్టీఆర్ చేసిన ‘టెంపర్’కి రీమేక్‌గా తమిళంలో అయోగ్య పేరుతో చిత్రం రూపొందుతుంది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా రాశీఖన్నా అలరించనుంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ముందుగా ప్రకటించారు. కానీ ఆరోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం. ఇటీవల ఒక పాటను చిత్రీకరిస్తుండగా విశాల్ కాలికి గాయమైంది. విశాల్ విశ్రాంతి తీసుకోవలసి రావడంతో షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా ముందుగా అనుకున్న సమయానికి షూటింగు పూర్తిచేయలేక పోతున్నందువలన విడుదల తేదీని వాయిదావేశారు. మే 10వ తేదీ ఈ సినిమాను భారీస్థాయిలో విడుదలచేయాలనే నిర్ణయానికి వచ్చారు.
*
అనీశా అనే అమ్మాయని ప్రేమిస్తున్నట్టు గత జనవరిలో ప్రకటించిన విశాల్, శనివారం హైదరాబాద్‌లో అనీశాతో నిశ్చితార్థం చేసుకున్నాడు. సెప్టెంబర్‌లో విశాల్ వివాహం జరగనుందని సమాచారం