ఈమె ఇంకా రొమాంటిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్‌పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. అనిల్ పాడూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోందని సమాచారం. ఇదిలాఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటికొచ్చింది. బాలీవుడ్ నటి మందిరాబేడి సినిమాలో కీలకపాత్ర చేస్తోందట. రీసెంట్‌గా ‘రొమాంటిక్’ టీమ్‌తో గోవాలో జాయినైందని టాక్. మందిర నెగెటివ్ షేడ్స్ పాత్ర చేస్తుందని సమాచారం. టీవీ సీరియల్ నటిగా పాపులారిటీ తెచ్చుకున్న మందిర బాలీవుడ్ సినిమాల్లో నటించడంతోపాటుగా టీవీ హోస్టుగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రభాస్ తాజాచిత్రం ‘సాహో’లోనూ నటిస్తోంది. ఆ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ‘రొమాంటిక్’లో హీరోయిన్‌గా దిల్లీమోడల్ కేతిక శర్మను ఖరారు చేశారు. ఈ సినిమాతో కేతిక టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆకాష్ పూరి లాస్ట్ సినిమా ‘మెహబూబా’లో నటనతో మంచి మార్కులే తెచ్చుకున్నాడు. కానీ బాక్సాఫీస్‌వద్ద విజయం లభించలేదు. మరి ఈ సినిమాతో అయినా ఆకాష్ పూరికి బ్రేక్ వస్తుందేమో చూడాలి.