కొత్త సిగ్నేచర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రితికా సింగ్ గుర్తుంది కదూ. తమిళ సినిమా ‘ఇరుది సుట్రు’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ. అదే చిత్రాన్ని వెంకటేష్ హీరోగా ‘గురు’ టైటిల్‌తో రీమేక్ చేస్తే, తెలుగులోనూ అదే పాత్రతో ఆకట్టుకుంది. స్క్రీన్‌పై బాక్సింగ్‌తో దుమ్ము దులపడమే కాదు, -‘ఓ సక్కనోడా..’ అంటూ వెంకీపై ప్రేమనూ వ్యక్తిపర్చి మెప్పించింది. ఈ బ్యూటీ రియల్ లైఫ్‌లోనూ ప్రొఫెషనల్ బాక్సర్ కమ్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్ అని తెలిసిందే. మొదటి సినిమా మూడు భాషల్లో విడుదలై హిట్టయిన గుర్తింపొచ్చినా, హీరోయిన్‌గా మాత్రం రితికాకు బ్రేక్ రాలేదు. దీంతో ఈమధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచుతూ సిగ్నేచర్ స్టిల్స్ విడుదల చేస్తోంది. రితిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఆ ఫొటో చూస్తే, గ్లామర్ పాత్రలకు రెడీ అన్న సిగ్నేచర్ స్టిల్‌లా ఉందంటున్నారు కుర్రాళ్లు. మరి, అవకాశాలు ఏ రేంజ్‌లో వస్తాయో చూడాలి.