తలసాని ని కలిసిన మా కార్యవర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొత్త అధ్యక్షుడిగా నటుడు నరేష్ బాధ్యతలు చేపట్టారు. నరేష్ ప్యానల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా జీవిత రాజశేఖర్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్ కనకాల, సంయుక్త కార్యదర్శిగా గౌతమ్‌రాజు, శివబాలాజీ విజయం సాధించటం తెలిసిందే. కాగా విజయం సాధించిన బృందం సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల ఆశీస్సులు తీసుకుంది. రెబల్‌స్టార్ కృష్ణంరాజు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లను మర్యాద పూర్వకంగా కలిశారు. టాలీవుడ్ అభివృద్ధికి మంత్రినుంచి హామీలు తీసుకున్నారు. ‘మా’ అభివృద్ధికి, కళాకారుల బాగోగులు చూసుకునేలా అన్నివిధాలా సహకరిస్తానని మంత్రి తలసాని హామీ ఇచ్చినట్టు కొత్త కార్యవర్గం వెల్లడించింది.