22న వినరా సోదర..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై శ్రీనివాస్ సాయి, ప్రియాంకజైన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘వినరా సోదరా వీరకుమార’. లక్ష్మణ్ క్యాదరి నిర్మాణంలో సతీష్‌చంద్ర నాదెళ్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రం 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ సినిమా కొత్త పాయింట్‌తో అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. ప్రేమకోసం చంపడం చావడం రెండూ తప్పేననే కొత్త పాయింట్‌ను డైరెక్టర్ సతీష్ అందంగా తెరకెక్కించాడన్నారు. చిత్ర నిర్మాత లక్ష్మణ్ క్యాదరి మాట్లాడుతూ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఈ సినిమా కోసం ఏడాదిన్నరగా దర్శకుడు సతీష్ ఎన్నో కష్టాలు పడ్డాడన్నారు. దర్శకుడు సతీష్ మాట్లాడుతూ నిర్మాత లక్ష్మణ్‌కు రుణపడి ఉంటానని, కొత్త పాయింట్‌తో తెరకెక్కించిన చిత్రం అందరికీ నచ్చుతుందన్నారు. హీరో శ్రీనివాస్‌సాయి మాట్లాడుతూ కొత్త పాయింట్‌తో కొత్త వారితో చేసిన సినిమా ఆదరణ పొందుతుందని నమ్మకంగా ఉన్నాను. ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కానన్న భావన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కెమెరామాన్ రవి, అర్జున్, అనిల్ మైలాపూర్, కిరణ్ సిహెచ్ తదితరులు పాల్గొన్నారు.