లక్ష్మీస్ ఎన్టీఆర్‌ని అడ్డుకోలేరు: వర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన దర్శకుడు వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఇప్పటికే సినీ రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే తాను నిర్మించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకాకుండా ఎవరూ ఆపలేరని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ప్రకారం సెన్సార్‌బోర్డు మినహా ఎవరూ సినిమాను ఆపలేరన్నారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని భావించి సెన్సార్ బోర్డు అడ్డుకుంటే వారికి సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసినట్టుగా సినిమాను ఆపే అవకాశాలు లేవని స్పష్టంచేశారు. అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబుని విలన్‌గా చూపిస్తున్నారని, ఎన్నికలు పూర్తయ్యేవరకూ సినిమా విడుదలను నిలిపివేయాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.