రియాలిటీలో లేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను రియాలిటీలో లేను. ఇది నిజమా? కాదా? అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం హ్యాపీగా ఉంది. ఎప్పటినుంచో రాజవౌళితో మళ్లీ పని చేయాలని అనుకుంటున్న తరుణంలో ఇది సెట్టయ్యింది. ఇండస్ట్రీలో బెస్ట్‌ఫ్రెండ్, దగ్గరైన వ్యక్తి, చాలా నచ్చే వ్యక్తి తారక్‌తో, బాగా తెలిసిన నిర్మాత దానయ్యతో పని చేయడం హ్యాపీగా ఉంది.
ప్రాజెక్ట్ ఎలా మొదలైందంటే:
కొన్ని నెలలుక్రితం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుంటే, దారిలోనే కదా.. ఓసారి ఇంటికి వచ్చివెళ్లు అని రాజవౌళి నుంచి వర్తమానం అందింది. వెళ్లాను. లోపలికెళ్లగానే తారక్ నేలమీద మంచి ఫోజులో కూర్చుని ఉన్నాడు. చూసి, తినేంటి ఇక్కడున్నాడు అనుకున్నా. ‘నువ్వు.. ఇక్కడేంటి బ్రో’ అని అడిగేశాను ఆపుకోలేక. తారక్ ఈలోపు ‘మీరేమైనా మాట్లాడుకోవాలా’ అంటూనే, ‘నేను బయటికెళ్తాను’ అన్నాడు. ‘నా ఫ్లైట్‌కి ఇంకా టైముంది. మీరేమైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి. నేను వెయిట్‌చేస్తాను’ అని నేనన్నాను. కొంతసేపు కన్‌ఫ్యూజన్‌లో ఉంచి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లి ఆయన ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు. మా ఇద్దరికీ ఆనందమేసింది. అదే విషయాన్ని ఇద్దరం ఒకేసారి రాజవౌళికి చెప్పాం. ఆ సంఘటన నా జీవితంలో మరచిపోలేనిది. సోఫాలో కూర్చున్న ఫొటో ఆ హ్యాపీ మూడ్‌లోదే. చాలా బాధ్యతగా డిజైన్ చేసిన పాత్రలను మేంకూడా అలాగే ఫీల్ అవుతూ చేస్తున్నాం. ఇదొక ఫిక్షనల్ స్టోరీ. జాగ్రత్తగా చేస్తున్నాం. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందొచ్చిన సినిమాకంటే ఇది పెద్ద హిట్‌కావాలని ఆశిస్తున్నా. నేను తారక్‌తో వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నా. మా ఇద్దరి షెడ్యూల్స్ ఇంకా గట్టిగా స్టార్ట్‌కాలేదు. కలిసి పనిచేయాల్సిన షెడ్యూల్స్ కోసం ఎదురు చూస్తున్నా.