పాత్రల చిత్రలహరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ్ హీరోగా ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోన్న చిత్రం ‘చిత్రలహరి’. సాయిధరమ్ తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్, నివేదా సేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో టీజర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ‘మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా బాగా వచ్చింది. కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. టైటిల్ చెప్పగానే బాగానచ్చింది. ఏప్రిల్ మొదటివారంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించి, 12న సినిమా విడుదల చేస్తాం. బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం. సాయిధరమ్‌కి మళ్లీ సుప్రీమ్ డేస్ వస్తాయి’ అన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ ‘మీడియాకు థాంక్స్. అడగ్గానే టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన సుకుమార్‌కి కృతజ్ఞతలు. అవకాశమిచ్చిన నిర్మాతలు నవీన్, రవి, మోహన్, నన్ను సపోర్ట్‌చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు థాంక్స్. సినిమా విషయంలో హ్యాపీగా ఉన్నా. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. హీరోయిన్ నివేదా పేతురాజ్ మాట్లాడుతూ ‘కిషోర్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కాన్ఫిడెంట్‌గా ఒప్పుకున్నా. ఆయన హీరోయిన్ క్యారెక్టర్‌ను బ్యూటిఫుల్‌గా నెరేట్ చేశారు. సాయిధరమ్ వండర్‌ఫుల్ కోస్టార్. సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. కల్యాణి ప్రియదర్శన్‌తో కలిసి వర్క్ చేయడం హ్యాపీ. సినిమా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకంగా ఉన్నాం’ అన్నారు. సునీల్ మాట్లాడుతూ ‘నేను భీమవరంలో చదువుకుంటున్న రోజుల్లో ఒరిజినల్ బిహేవియర్ ఎలాంటిదో, అలాంటి క్యారెక్టర్ ఇచ్చాడు దర్శకుడు కిషోర్ తిరుమల. మంచి క్యారెక్టర్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సినిమా ద్వారా అలాంటి పాత్ర దొరకటం హ్యాపీ’ అన్నారు. హీరో సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ ‘అడగ్గానే వాయిస్ ఓవర్ ఇచ్చిన సుకుమార్‌కు థాంక్స్. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతంతోపాటు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నాలుగు పాటలు ఆడియన్స్‌ని మెప్పిస్తాయి. మంచి సినిమా చేయడానికి అవకాశమిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. చాలా సపోర్ట్‌చేస్తూ, ఎక్కడా లోటులేకుండా చూసుకున్నారు. ఇక డైరెక్టర్ కిషోర్ తిరుమల కథను ఎంతబాగా చెప్పాడో, అంతకంటే బాగా డైరెక్ట్ చేశాడు. కార్తీక్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. నువ్వు నేను సినిమా చేస్తున్న సమయంలో సునీల్ కామెడీ టైమింగ్, సెన్స్‌ను ఎంజాయ్ చేసేవాడిని. నటుడిగా మారిన తర్వాత ఆయనతో ఓ సినిమా అయినాచేయాలని అనుకున్నా. ఈ సినిమాలో కలిసి పని చేశా. ఆయనతో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను అన్నారు. ఇదిలావుంటే టీజర్‌లో సాయధరమ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. చివరి పాత్రగా టీజర్‌లో పరిచయమైన సాయధరమ్ -నా పేరు విజయ్. జీవితంలో అదే లేదు అంటూ పేథటిక్‌గా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.