15న ‘ఆ నిమిషం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంకటేశ్వర డిజిటల్ మూవీస్ పతాకంపై కొత్త హీరోహీరోయిన్లను పరిచయం చేస్తూ బండారు హరితేజ నిర్మించిన చిత్రం -ఆ నిమిషం. ఈనెల 15న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఫిలిం ఛాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి నటుడు రవిప్రకాష్, చిత్ర దర్శకుడు కళారాజేష్, చిత్ర హీరో ప్రసాద్‌రెడ్డి, హీరోయిన్ రేణుక, డీవోపీ షరీఫ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నజీర్, వినోద్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. దర్శకుడు కళారాజేష్ మాట్లాడుతూ ‘ఆడపిల్లని స్వాగతించండి. వారిని సంరక్షించండి. ఆడపిల్ల ఏ దేశానికైనా నిజమైన ఆస్తి’ అనే కానె్సప్ట్‌తో సినిమా రూపొందించాం అన్నారు. పడక సుఖం, పరపతికోసమన్నట్టే వాళ్లను చూస్తున్నారని, పురిటిలోనే గొంతు నొక్కుతున్నవాళ్లూ ఉన్నారన్నారు. ఆడపిల్లను నిర్లక్ష్యం చేస్తే సమాజానికి భవిష్యత్ ఉండదన్న ఇతివృత్తంతో చిత్రం నిర్మించామన్నారు. 15న రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. నటులు రవిప్రకాష్ మాట్లాడుతూ సమాజంలోని బర్నింగ్ పాయింట్‌తో సినిమా తెరకెక్కింది. సదుద్దేశంతో నిర్మించిన చిత్రాన్ని ఆదరించాలని కోరారు. మా తొలి ప్రయత్నం సక్సెస్ కావాలని, సినిమా ఘన విజయం సాధించాలని హీరో ప్రసాద్‌రెడ్డి తదితరులు ఆకాంక్షించారు.