సీత ప్రయాణమెటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్పిక గణేష్, గాయత్రి గుప్త, కాతెర హకిమి, నేసా ఫర్ హాది, ఉమాలింగయ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం -సీత ఆన్ ది రోడ్. జేపీ మోషన్ పిక్చర్స్, డై మూవీస్ పతాకాలపై ప్రణీత్ యారోన్ దర్శకత్వంలో ప్రణీత్, ప్రనూప్ జవహర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం. తాజాగా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు, నిర్మాత ప్రణీత్ యారోన్ మాట్లాడుతూ సమాజంలో స్ర్తిలకు జరుగుతోన్న అన్యాయాలు, అక్రమాలకు చలించి కథ రాసినట్టు చెప్పారు. ఐదుగురు అమ్మాయిలు జీవితంలో స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఎదగాలనుకుంటారు. అలాంటి అమ్మాయిలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నదే చిత్ర కథ. హైదరాబాద్, కర్ణాటక, గోవావంటి అందమైన లొకేషన్లలో షూటింగ్ జరిపాం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరి సపోర్ట్‌తో చిత్రాన్ని పూర్తిచేశాం. అన్నివిధాలా సహకరించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు కృతజ్ఞతలు. త్వరలోనే సినిమా విడుదల చేస్తామన్నారు. నటి కల్పిక గణేష్ మాట్లాడుతూ ఇదొక ఇంపారింగ్ ఉమెన్స్ స్టోరీ. ప్రతి ఒక్కరూ ది బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చారన్నారు. గాయత్రి మాట్లాడుతూ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన ప్రణీత్‌కి థాంక్స్. ప్రతిఒక్కరూ కనెక్టయ్యేలా చిత్రం ఉంటుందన్నారు. నిర్మాత ప్రనూప్ జవహర్ మాట్లాడుతూ సినిమాకి కర్త కర్మ క్రియ అన్నీ దర్శకుడేనని, అంతా కష్టపడి చేసిన సినిమా -సీత ఆన్ ది రోడ్‌ని అందరూ ఆదరించాలని కోరారు. ఐఎన్‌టీయుసి అధ్యక్షురాలు విజయలక్ష్మి చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.