నయన్‌తో విజయ్?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ క్రమంగా సౌత్‌కు విస్తరిస్తున్నాడు. తమిళంలో విజయ్‌కు ఫాలోయింగ్ తక్కువేం లేదు. ‘నోటా’ ప్లాపైనా తమిళ మేకర్లు ఆఫర్లిచ్చేందుకు ఎగబడుతూనే ఉన్నారు. తాజాగా ఈ క్రేజీ రౌడీకి ఓ తమిళ- తెలుగు ఆఫర్ వచ్చిందని వినికిడి. ‘నోటా’ ద్విభాషా చిత్రమే అయినా, ఈ బైలింగ్వుల్లో మాత్రం హీరోయిన్ స్పెషల్ అట. ఈ సినిమా కోసం సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార విజయ్‌తో జోడీ కట్టబోతోందని వినికిడి. తమిళ నిర్మాత ఎస్ఆర్ ప్రభు ఈ సినిమా నిర్మిస్తూ యువ దర్శకుడిని పరిచయం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. విజయ్ దేవరకొండ ఫాలోయింగ్‌కు నయనతార స్టార్డమ్ తోడైతే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఇప్పటినుంచే అంచనాలు వేస్తున్నారు. అయితే, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.