వాడూ, పిల్లలే చంపేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాడూ, పిల్లలూ కలిసి నన్ను చంపేశారు -అంటున్నారు లక్ష్మీస్ ఎన్టీఆర్. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ట్యాగ్‌లైన్‌తో మొదలైన ట్రైలర్‌లో -వెన్నుపోటు ఘట్టాలు, ఎన్టీఆర్ జీవిత చరమాంకంలోని ఎదురు దెబ్బలు చూపించే ప్రయత్నం చేశారు. ‘నా ప్రజలే నన్నింతటి వాడిని చేశారు. ఇప్పుడు నన్ను వద్దనుకుని ఆ పవర్‌ని వాళ్లే వెనక్కి తీసుకున్నారు’ అన్న ఎన్టీఆర్ భారమైన డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘వీరనుకున్నట్టు ఆవిడ అంత మంచిది కాదు. ఇంతకుముందే ఆవిడకు చాలామందితో అఫైర్స్ ఉన్నాయి’ అంటూ చంద్రబాబు పాత్రధారి చెబుతున్న డైలాగ్‌ను దర్శకుడు వర్మ ఆసక్తికరంగా చిత్రీకరించారు. ‘రామారావుగారు, ఆయన్ను పెళ్లి చేసుకోమని అడిగారు’ అన్న డైలాగ్ లక్ష్మీపార్వతి ఎవరితోనో చెబుతుంటే, ‘శ్రీదేవి, జయసుధ, జయప్రదలాంటి మహామహా అందగత్తెలతో పరిచయమున్న ఆయనికి.. దానిలో ఏముందనో..’ అంటున్న ఎన్టీఆర్ కుమార్తె పాత్రధారి డైలాగ్ చెప్పడం -ట్రైలర్‌లో చూపించారు. ‘మన దగ్గర నిజం ఉంది. నిజాన్ని ఎవ్వరూ ఆపలేరు’ అన్న ఎన్టీఆర్ డైలాగ్ కంటిన్యూ అవుతుండగానే గర్జన.. సింహగర్జన అన్న కోరస్‌తో ట్రైలర్ ముగిసింది. లక్ష్మీపార్వతి కోణంలో ఆసక్తికరమైన అనేక అంశాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో కనిపించే అవకాశాలు ఉన్నట్టు అర్థమవుతోంది.