అటు నిర్మాతగానూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా వున్న కాజల్ అగర్వాల్ ఎన్నో హిట్స్, ఫ్లాప్స్ అందుకుంది. సినిమాల ఆఫర్స్ తగ్గడంతో ఐటెమ్ సాంగ్స్ చేసేందుకు కూడా రెడీ అయిపోయింది. జనతా గ్యారేజ్‌లో పక్కా లోకల్ అంటూ అదరగొట్టింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా అవి కాస్త ఫ్లాప్స్ అయ్యాయి. ఇపుడు నిర్మాతగా మారి సినిమాలు తీస్తాను అంటోంది. అయితే ముందు తాను మరో అందాల భామ తమన్నాతో కలిసి సినిమాను తీయాలని ప్లాన్ చేసింది. ‘అ’ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని అనుకుంది. కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమా అటకెక్కింది. తాజాగా అ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో మరో సినిమా చేసేందుకు సిద్ధం అయింది. అయితే ఈ సినిమాకు కాజల్ నిర్మాతగా మాత్రమే కాదు హీరోయిన్‌గా కూడా నటిస్తోందట. ప్రశాంత్‌వర్మ ప్రస్తుతం రాజశేఖర్‌తో కల్కి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కాజల్ సినిమా మొదలుపెట్టనున్నాడు. హీరోయిన్స్ నిర్మాతలుగా మారడం చాలా అరుదు. ఒకరిద్దరిని మినహాయిస్తే ఆ ప్లేస్‌లోకి కాజల్ వచ్చి చేరింది.