రాక్షసన్ మొదలైంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో సూపర్ హిట్ అయిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కానె్సప్ట్ చిత్రాలతో తనను ప్రూవ్ చేసుకోడానికి ప్రయత్నిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్ హీరోగా చేస్తున్నాడు. రైడ్, వీర చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెనమత్స దర్శకత్వం వహిస్తున్నాడు. కోనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మాతగా రీమేక్ మూవీ గురువారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హవీష్ కోనేరు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా నిర్మాత హవీష్ కోనేరు మాట్లాడుతూ- తమిళంలో సూపర్ హిట్ అయిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో మా బ్యానర్‌లో ప్రిస్టేజియస్‌గా తెరకెక్కిస్తున్నాం. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా కోసం తన లుక్‌ను మార్చుకున్నారు. ఈ రోజునుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌కు రమేష్‌వర్మ దర్శకుడు. గీబ్రాన్ సంగీతం అందిస్తుండగా వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫి చేస్తున్నారు.