మెల్లమెల్లగా... ఏబీసీడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటెంట్ కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న హీరో అల్లు శిరీష్ చేస్తున్న తాజా చిత్రం -ఏబీసీడీ. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. చిత్రానికి సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీ్ధర్‌రెడ్డి, యస్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రాన్ని డి సురేష్‌బాబు సమర్పిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు, బాలనటుడు భరత్ ఫ్రెండ్ పాత్రల్లో కనిపిస్తారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుదాసాంధీ సంగీతం సమకూరుస్తున్నారు. చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను హైలైఫ్ పబ్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. సినిమాలో ఈపాట ఆలపించిన మోస్ట్‌వాంటెడ్ సింగర్ సిద్ శ్రీరామ్ లైవ్ ఈవెంట్‌లో పాట పాడి సందడి చేశారు. సాంగ్‌కు సంబంధించిన బిగ్ సీడీని నిహారికా కొణిదెల విడుదల చేశారు. చిత్రాన్ని మార్చి 1న విడుదల చేయనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జుధాశాండీ మాట్లాడుతూ ‘తెలుగు ఇండస్ట్రీకి రావాలన్న చిరకాల కల నేటితో నెరవేరింది’ అన్నారు. నిర్మాత మధుర శ్రీ్ధర్ మాట్లాడుతూ ‘శాండీ మంచి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరొస్తుంది. సినిమా కోసం అంతా కష్టపడ్డాం. ఫలితం కోసం ఎదురుచూస్తున్నాం’ అన్నారు. దర్శకుడు సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ ‘నాపై నమ్మకంతో దర్శకుడిగా అవకాశమిచ్చిన అల్లు శిరీష్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. వెన్నుతట్టి ప్రోత్సహించిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు. కృష్ణకాంత్ సాహిత్యం, సిద్ వాయిస్‌తో పాటకు మరింత అందం వచ్చిందన్నారు. నిర్మాత ఎస్‌కెఎన్ మాట్లాడుతూ.. ‘పాట చార్ట్‌బస్టర్, సినిమా బ్లాక్‌బ్లస్టర్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ మాట్లాడుతూ ‘మంచి టీంతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. కష్టపడ్డాం. ఈరోజు విడుదలైన సాంగ్ చాలా పెద్దహిట్టవుతుంది అలాగే సినిమా పెద్ద హిట్ కావాలి’ అని ఆకాంక్షించారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ సినిమా గురించి చెప్పేందుకు చాలా ఉందని, అదంతా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడతానన్నారు. బెంగళూరులో కారులో వెళ్తున్నపుడు విన్న పాట తనను హాంటింగ్ చేసిందని, దాన్ని కంపోజ్ చేసిన జుదాశాండీయే ఏబీసీడీ చిత్రానికి కరెక్ట్ అనిపించిందని అన్నారు. అతనితో సినిమాకు వర్క్‌చేయడం హ్యాపీగా ఉందన్నారు. తెలుగు సినిమాకు మంచి మ్యూజిక్ డైరెక్టర్‌ను పరిచయం చేస్తున్నాం. సింగర్ సిద్ శ్రీరామ్ ఇప్పుడొక ట్రెండ్. నా పాటను ఆయన పాడటం చాలా హ్యాపీగా ఉందన్నారు.