నా రుధిరం కేసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1891 సారాగడి యుద్ధవీరుడు హవీల్దార్ ఇషార్ సింగ్ మళ్లీ కళ్లముందు ప్రత్యక్షమయ్యాడు -అక్షయ్‌కుమార్ రూపంలో. బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘కేసరి’. ఇషార్ సింగ్ లీడ్ రోల్‌లో అక్షయ్ కనిపిస్తున్న చిత్రాన్ని అనురాగ్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. అక్షయ్‌కి జోడీగా పరిణీతి చోప్రా కనిపించనుంది. గురువారం విడుదలైన ట్రైలర్‌లో యుద్ధవీరుడు హవీల్దార్ ఇషార్‌సింగ్ పాత్రలో అక్షయ్ చెబుతున్న డైలాగ్ -దేశభక్తిని ప్రేరేపించేదిగా ఉంది. ‘నేను తన బానిసనని, భారతీయులంతా మూర్ఖులని ఓ బ్రిటీషర్ నాతో అన్నాడు. అలాంటివారికి బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది’ అంటూ అక్షయ్ చెప్పిన డైలాగ్ సినిమా స్టేటస్‌ను వెల్లడిస్తోంది. పదివేలమంది ఆఫ్ఘానీయులతో 21మంది సిక్కులు జరిపిన పోరాటమే సారాగడి యుద్ధం. అసలు ఆ యుద్ధం ఎందుకు సంభవించింది? యుద్ధం తరువాత ఏం జరిగిందన్నదే ‘కేసరి’ కథ. యుద్ధం కళ్లముందు జరుగుతుందా? అన్నట్టు చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ‘నేను ధరించిన తలపాగా కేసరి. కారుతున్న నా నెత్తురు కేసరి’ అంటూ అక్షయ్ పవర్‌ఫుల్ డైలాగులను టీజర్‌లో చూపించారు. మార్చి 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.