రాజ్‌కుమార్ బర్జాత్య మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రాజశ్రీ ఫిలింస్ అధినేత రాజ్‌కుమార్ బర్జాత్య గురువారం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. తండ్రి అడుగుజాడల్లో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన రాజ్‌కుమార్ ఎన్నో విమర్శకుల ప్రశంసలందుకున్న సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించారు. టెలివిజన్ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రాజ్‌కుమార్. దాదాపు అన్ని ప్రముఖ హిందీ చానల్స్‌లోనూ రాజ్‌కుమార్ నిర్మాణంలో తెరకెక్కిన సీరియల్స్ ప్రసారమయ్యాయి. తన వారసుడిగా సూరజ్ బర్జాత్యను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాజ్‌కుమార్, తనయుడి దర్శకత్వంలో మైనే ప్యార్‌కియా, హమ్ ఆప్ కే హై కౌన్, వివాహ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. దాదాపు 70 సంవత్సరాలుగా సినీ రంగంతో సంబంధాలున్న రాజ్‌కుమార్ బర్జాత్య మృతిపట్ల బాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.