కదలనున్న దండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యశశ్విని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో మంగమూరి శేషగిరిరావు రూపొందిస్తున్న చిత్రం ‘దండు’. నీరజ్ శ్యామ్, నేహ సక్సేనా, సాయికుమార్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, వెరైటీ కథ, కథనంతో రూపొందిస్తున్న ఈ చిత్రం కోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డామని, 1970 నుండి 96 వరకు ఆదోనిలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా కథను రాసుకున్నామని తెలిపారు. ఈ చిత్రం కన్నడంలో విజయాన్ని సాధించిందని, అదేవిధంగా తెలుగువారికి నచ్చుతుందన్న నమ్మకం వుందని, ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రానికి కెమెరా:హరీష్.ఎస్.ఎస్., పాటలు:పోతుల రవికిరణ్, విగీనా రఫి, సంగీతం:సంజీవ్ మేగోటి, ఎడిటింగ్:శర్వాణి శివకుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సంజీవ్ మేగోటి.