లీడ్‌రోల్‌లోనే నటిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు టెలివిజన్ రంగంలో వీడియో జాకిగా కెరీర్ మొదలుపెట్టి తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న జయతి, హీరోయిన్‌గా పరిచయమవుతూ రూపొందుతున్న చిత్రం ‘లచ్చి’. హారర్, థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఈశ్వర్ దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా జయతి చెప్పిన విశేషాలు...

వీడియో జాకిగా
మాది విజయవాడ. చిన్నప్పటినుండి ఎంటర్‌టైన్‌మెంట్ రంగమంటే ఇష్టం. ఆ ఉద్దేశ్యంతో ఇంటర్‌మీడియెట్‌లో వున్నపుడు జెమిని టీవీ కొత్త చానెల్‌ను ప్రారంభించారు. అందులో వీడియో జాకిగా అవకాశం కోసం ప్రయత్నించాను. అక్కడ విజెగా ఐదారేళ్లపాటు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. నేను చేసిన కార్యక్రమాల్లో వెనె్నల ప్రోగ్రాం దాదాపు పాపులరైంది. ఆ సమయంలోనే సినిమాల్లో నటించమని చాలా అవకాశాలు వచ్చాయి. కానీ నేను పెద్దగా ఆసక్తి చూపలేదు.

కథ నచ్చడంతో
సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన వుంది. ఆ సమయంలోనే మలయాళంలో హిట్ అయిన ‘మైబాస్’ అనే సినిమా రైట్స్ తీసుకున్నాను. ఆ సినిమాను తెరకెక్కించేముందు దర్శకుడు ఈశ్వర్ ఓ కథ చెప్పారు. కథ వింటున్నంతసేపు మైమరచిపోయాను. వెంటనే సినిమా చేయాలనిపించింది.
హారర్ థ్రిల్లర్‌గా
‘లచ్చి’ పేరుతో తెరకెక్కే ఈ సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో వుంటుంది. దాంతోపాటు హారర్, కామెడీ కలగలిసి వుంటాయి. హారర్ అనగానే అదేదో దెయ్యాలు వచ్చేసి భయపెట్టేలా కాదు. అందరికీ నచ్చే అంశాలతో తెరకెక్కే ఓ మంచి కథ అని చెప్పొచ్చు. ఇటీవలే తిరుపతి తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేశాం. అలాగే ఓ పాటను కూడా చిత్రీకరించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.

ప్రొడక్షన్ వైపే
నేను టెలివిజన్ మీడియాలో వుండడంతో అన్ని శాఖలపై అవగాహన పెంచుకున్నాను. ముఖ్యంగా నాకు ప్రొడక్షన్ అంటే చాలా ఆసక్తి. పలు టీవీ కార్యక్రమాలు కూడా చేశాను. ఈ కథ నచ్చడంతో ఈ సినిమాను కూడా నా స్వంత బ్యానర్‌లోనే నిర్మిస్తున్నాను. భవిష్యత్తులో కూడా సినిమాలు నిర్మిస్తా.
హీరోయిన్‌గానే
‘లచ్చి’ సినిమా విడుదల తరువాత నన్ను హీరోయిన్‌గా ప్రేక్షకులు ఆదరిస్తే హీరోయిన్‌గానే నటిస్తా. అంతేకానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయను.

- శ్రీ