ఐదు పాటలతో రైట్ రైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్ అశ్విన్, పూజాజవేరి జంటగా శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మనూ దర్శకత్వంలో జె.వంశీకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. నిర్మాత మాట్లాడుతూ, తొలి షెడ్యూల్ అరకు, ఒడిస్సాలో, రెండో షెడ్యూల్ వికారాబాద్ బస్టాండ్, అడవిలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించామని తెలిపారు. ఇటీవల మూడవ షెడ్యూల్‌ను కేరళలో చేశామని, ఐదు పాటలతో రూపొందిన ఆడియోను త్వరలో విడుదల చేయనున్నామని, జూన్ ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు. కీలకపాత్రలో బాహుబలి ప్రభాకర్ డ్రైవర్‌గా, సుమంత్ అశ్విన్ కండక్టర్‌గా నటించారని తెలిపారు. మలయాళంలో విజయాన్ని సాధించిన ఆర్డినరి చిత్రాన్ని పూర్తిగా తెలుగు నేటివిటీకి మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించామని, ఎస్.కోట నుండి గవిటికివెళ్ళే ఓ బస్సు నేపథ్యంలో లవ్, కామెడీ, మిస్టరీ అంశాలతో ఈ చిత్రం సాగుతుందని ఆయన తెలిపారు.