పిల్లల కథల లాలీపాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఉన్న సమాజంలో జీవన పోరాటానికి సమయం సరిపోవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబాల్లోని అనుబంధాలకు ఇంకా సమయం ఎక్కడిది? ముఖ్యంగా పిల్లలకు నీతి కథలు బోధించడానికి అమ్మమ్మలు తాతయ్యలు ఉండరు. ప్రస్తుతం ప్రపంచీకరణ దృష్ట్యా టీవీల్లో రకరకాల బొమ్మల కార్యక్రమాలు వస్తున్నా కూడా వాటిని చూసి సమయం వేస్ట్ చేసుకుంటున్నారు తప్ప దానిద్వారా ఎంతమంది పిల్లలకు విజ్ఞానాన్ని పొందుతున్నారనేది ఆలోచించాల్సిన విషయమే. అందుకే 5నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలకు అద్భుతమైన తెలుగు కథలను అందించడానికి లాలీపాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ లాలీపాప్ స్టోరీస్ (పిల్లల కథలు) అనే మొబైల్ యాప్‌ను విడుదల చేశారు. డైరెక్టర్ రామలక్ష్మి ఏమిరెడ్డి ఆలోచనలతో ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత రావి కొండలరావు ఆధ్వర్యంలో రూపొందించిన ఈ మొబైల్ యాప్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆ విష్కరించారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, సంజయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలకు నీతి కథలు చెప్పే పరిస్థితి లేదు. ముఖ్యంగా అప్పట్లో చందమామ పుస్తకం వుండేది. కానీ ఇప్పుడు టీవీల్లో వస్తున్న కార్టూన్లు చూసి, టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇలాంటి సమయంలో అచ్చతెలుగు కథల్ని పిల్లలకి అర్థమయ్యే రీతిలో రూపొందించినందుకు ఈ యూనిట్‌ని అభినందిస్తున్నాను అన్నారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. మా చిన్నప్పుడు అద్భుతమైన తెలుగు కథలతో ఎన్నో పుస్తకాలు వచ్చేవి. ముఖ్యంగా చందమామ పుస్తకం ఇప్పటికీ కనిపించినా దాన్ని అదే ఆసక్తితో చదవాలనిపిస్తుంది. ప్రస్తతం తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలకోసం సమయం కేటాయించలేకపోతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు నీతి కథలు చెప్పడానికి ఎవరూ లేరు. మొదటినుంచే నీతి కథలు వింటే వారిలో మానసిక పరిపక్వత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో లాలీపాప్ పిల్లల కథల యాప్‌ను విడుదల చేయడం ఆనందంగా వుంది. ప్రస్తుతం ప్రతీ పిల్లవాడి చేతిలో మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. మారుతున్న టెక్నాలజీ ప్రకారం మనమూ మారాలి. కానీ మన సాంప్రదాయాలను, విలువల్ని మరిచిపోకూడదు. ముఖ్యంగా తెలుగు భాషను గౌరవించాలి. ఈ ప్రాజెక్టులో భాగంగా నాకు కూడా ఓ పాట పాడే అవకాశాన్ని కల్పిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.